DEEPAVALI SONG
Ooru Vaada ఊరూ వాడా Song Lyrics In Telugu Font
Singers : మంగ్లీ & శిశిర
Lyricst : Subhash Narayan Enjapuri
Music By : Baji
Singers : మంగ్లీ & శిశిర
Lyricst : Subhash Narayan Enjapuri
Music By : Baji
Telugu Lyrics
పల్లవి
ఓ... ఓ... ఓ...
ఊరూ వాడా ఉత్సాహంగా వెలుగులు చిమ్మెనే
చుట్టాలంతా ఆనందంగా సందడి చేసేలే
జోరుగా పండగ చేద్దాం దీపాల కాంతుల్లో
మస్తుగా చిందులు వేధ్ధాం ఆడీ పాడీ మనం ఆడీ పాడీ
ఇక ఆడీ పాడీ
ఐశ్వర్య కాంతులు నింపే పండగ వచ్చిందే
మెరుపులు జల్లే నేలను తాకే దీపావలై
నోరూరించే పిండివంటల పండగ వచ్చిందే
లక్ష్మీదేవి దీవించాలి ప్రతి ఒక్కరిని
సుమనస వందిత సుందరి మాత చంద్ర సహోదరి వేదమయే మునిజన వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేద మతే పంకజవాసిని దేశ సి పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమాం
*చరణం 1*
దీపమే మురిసిన వేళా నవ్వులే కురిసిన వేళా
ఆడపడుచుల అందాలు మేళా
పూజలే జరిపిన వేళా దీవెనే పొందిన వేళా
ఇంట్లో నిండుగా సిరులొలకాల
వచ్చేటి రోజులు అన్ని శ్ సిరి కాంతులవ్వాలే
ప్రతి గడప ముంగిళ్లో వెలుగే
మనమంతా బాగుండాలే
నవ కాంతులే పూయాలే
బంధాలు స్నేహాలన్నీ తేడా లేక ఒకటవ్వాలే
ఐశ్వర్య కాంతులు నింపే పండగ వచ్చిందే
మెరుపులు జల్లే నేలను తాకే దీపావలై
నోరూరించే పిండివంటల పండగ వచ్చిందే
లక్ష్మీదేవి దీవించాలి ప్రతి ఒక్కరిని
*చరణం 2*
ప్రమిదలే వెలిగే వేళా పండగే జరిగే వేళా
ప్రేమలే పొంగే నంట మావ
కలిసే అనుబంధాలా మురిసే ఆ సంతోషాలా చూడగా దైవాలే రావాలా
అన్నయ్య అనురాగాలే మెల్లంగా తెలిసేనే చెల్లెమ్మ చిలిపితనాలా పనులే
సందళ్ళు చేస్తూ ఉంటే ఆ హా
సరదాగా ఆడిస్తుంటే ఆ హా
ప్రతి ఏడు ఈ దీపావళి మళ్లీ మళ్లీ రావాలే
Online Video Song Credit Goes To Mic (YouTube)










No comments:
Post a Comment
Thanks for commenting. We will review your comment and approve soon