Image Credit Goes To YouTube Devi Mounama దేవి మౌనమా Song Lyrics In Telugu Font
Devi Mounama Song Lyrics From Premabhishekam (1981 ) TELUGU MOVIE . This is a lovely song penned by DASARI NARAYANA RAO Starring ANR,SRIDEVI It is Sung By S P Balasubrahmanyam, P. Susheela and Music composed by Chakravarthy
Song : Devi Mounama
Movie Name : Premabhishekam (1981)
Sung By : S P Balasubrahmanyam, P. Susheela
Lyrics By : Dasari
Music By : Chakravarthy
Click
here to Download Or Listen
Devi Mounama- Premabhishekam Telugu Lyrics పాట : దేవి మౌనమా చిత్రం : ప్రేమాభిషేకం (1981) సంగీతం : చక్రవర్తి గీతరచన : దాసరి గాయనీ గాయకులు : ఎస్ పి బాలు, సుశీల పల్లవి: దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పైనా దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా చరణం 1: మౌన భంగము.. మౌన భంగము భరియించదు ఈ దేవి హృదయము ప్రేమ పాఠము.. ప్రేమ పాఠము వినకూడదు ఇది పూజా సమయము దేవి హృదయము విశాలము.. భక్తునికది కైలాసము హే దేవి హృదయము విశాలము.. భక్తునికది కైలాసము కోరిక కోరుట భక్తుని వంతు... అడగక తీర్చుట దేవత వంతు ధూపం వేయుట భక్తుని వంతు... పాపం మోయుట దేవుని వంతు పాపానికి మోక్షం ధూప దర్శనం... ఈ ప్రాణికి మోక్షం నామ స్మరణం.. నీ నామ స్మరణం దేవీ... దేవీ... దేవీ... దేవీ... దేవీ కోపమా... శ్రీదేవీ కోపమా దేవీ కోపమా.... శ్రీదేవీ కోపమా నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పైనా దేవీ కోపమా ... శ్రీదేవీ కోపమా చరణం 2: స్వామి విరహము అహోరాత్రము చూడలేదు నీ దేవి హృదయము దేవీ స్తోత్రము... నిత్య కృత్యము సాగనివ్వదు.. మౌన వ్రతము స్వామి హృదయము ఆకాశము... దేవికి మాత్రమే అవకాశము స్వామి హృదయము ఆకాశము... దేవికి మాత్రమే అవకాశము అర్చన చేయుట దాసుని వంతు... అనుగ్రహించుట దేవత వంతు కోపం తాపం మా జన్మ హక్కు... పుష్పం పత్రం అర్పించి మొక్కు నా హృదయం ఒక పూజా పుష్పం... నా అనురాగం ఒక ప్రేమ పత్రం.. నా ప్రేమ పత్రం దేవీ .... దేవీ.... దేవీ.... దేవీ దేవి మౌనమా ... శ్రీదేవి మౌనమా దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పైనా దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా VIDEO
SHARE ON SOCIAL PAGES
No comments:
Post a Comment
Thanks for commenting. We will review your comment and approve soon